జనసేన జండా మోస్తే దేశ ద్రోహం గానే బావించాలి



భారత ఎన్నికల సంఘం తెలంగాణాలో
ఎమ్ ఐ ఎమ్ పార్టి ని , ఆంధ్రప్రదేశ్ లో జనసేన జండాను రద్దు చేయాలి ..
జనసేన జండా రూపం మత సామారస్యానికి ప్రమాదం కాదా !
జనసేన జండా భారతీయుల మనోభావాలకు ఆరని గాయం ..
**********************
మేడా శ్రీనివాస్ , విమర్శ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
***********************
జనసేన జండా ను, అసదుద్దీన్ ఓవైసీ పార్టిని రద్దు చేసే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు ..
భారత్ వంటి లౌకిక దేశంలో జనసేన జండా రూపం జీసెస్ క్రీస్తును అవమానించే విధంగా వుంటుందని , తద్వారా ఇతర మతాలలో వాగ్వివాదాలకు అవకాశంగా మరే ప్రమాద పరిస్థితులు వుంటాయన్నారు . జీసెస్ క్రీస్తుకు శిలువ వేసిన యూదు దేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి జనసేన జెండాను మత విద్వేషాలకు దారి తీసే కుట్ర పూరిత దురుద్దేశ్యంతోనే ఆ పార్టి రూప కల్పన చేసి నట్టుందన్నారు . ఆంధ్రప్రదేశ్ లో జనసేన జెండాను చూస్తున్నప్పుడు ఇజ్రాయిల్ యూదుల జెండానా ! అన్నట్టుగా కనపడుతుందన్నారు .
ఏ రాజకీయ పార్టి జండాలో నైనా రాష్ట్ర అభిమానం, దేశభక్తి కనపడాలి . జనసేన జండా రూపం మాత్రం యూదు దేశపు ఇజ్రాయిల్ జెండా మూలాలు కనపడుతుంటాయి . అమాయకంగా జనసేన జెండా మోస్తున్న వారిలో జాతీయ బావలు , దేశ సార్వబౌమాధికార గుర్తులు ఏ విధంగా కనపడతాయో ఆ పార్టిలో స్పృహ వున్న వారు చెప్పాలి . రాజకీయ పార్టిలు ఎన్నైనా ఉండొచ్చును ఆ పార్టి మూలాల్లో సామాజిక స్పృహతో బాటుగా దేశ భక్తి నర నరాన్న ఇమిడి ఉండాలి . జండా రూపకల్పంలో ఎన్నికల సంఘం ప్రమేయం పెద్దగా లేక పోయినప్పటికి సామాజిక భద్రతకు , దేశ సమగ్రతకు , మత సామారస్యానికి ముందు ముందు విఘాతం కలుగుతుంది అనే పరిస్థితులు ఉత్పన్నమౌతాయి అనుకుంటే నిఘా విభాగాలు ముందస్తుగా అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి , కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికలను సమర్పించి శాంతి భద్రతలను కాపాడే దిశగా పాలనా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు .
విదేశీ బావజాలం , ఉగ్రవాద ఉన్మాద సిద్ధాంతాలతో భారతదేశంలో రాజకీయ పార్టిలు నడపటంపై కేంద్ర ఎన్నికల సంఘం , కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రికరించలేక పోతుందని, ప్రక్షాళన దిశగా కేంద్ర నిఘా విభాగం చర్యలు చేపట్టాలి . తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అసదుద్దీన్
ఓ వై సి ఎమ్ ఐ ఎమ్ పార్టి పని తీరులో భారతదేశ సార్వబౌమాధికారం , జాతీయ సమగ్రత కనీసం కనపడదనేది ఏ మాత్రం సందేహం లేదు. సందర్బం దొరికి నప్పుడల్లా ఆ పార్టి భారత్ పై వ్యతిరేకత వెళ్ళగక్కుతుంటుంది . భారతదేశ జాతీయ గీతం , జాతీయ జెండా , రాజ్యాంగం పై కూడా ఆ పార్టి విషం కక్కుతుంది . కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరులు నేరుగా పార్లమెంట్ లో సైతం భారత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్న రాజకీయ స్వప్రయోజనాల కోసం అలాంటి వారిపై చర్యలు చేపట్టటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి . ఇజ్రాయిల్ యూదుల జెండా నమూనాతో జనసేన పార్టి ని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య అతను నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక సన్నివేశంలో అవసరం లేకున్నా పాతబస్తీ లోకి బొట్టు పెట్టుకుని రాకూడదని , అదే విధంగా డైరెక్టర్ కు ఇష్టం లేని రాజకీయ సన్నివేసాలు కొన్ని కల్పించరనే విమర్శలు పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి . నేను వచ్చింది పాతబస్తీనే పాకిస్తాన్ కాదు అనే సన్ని వేసాన్ని ఇమిడ్చి యూదు జెండా బావజాలాన్ని పవన్ కళ్యాణ్ నిరూపించుకుని భారత్ వంటి లౌకిక దేశంలో మత ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారు . ఒక ప్రక్క హిందువులను , మరో ప్రక్క క్రిష్టియన్స్ ను అంటు ప్రక్క దారిలో ముస్లిమ్స్ లో మత సామారస్యాన్ని విచ్చిన్నం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పార్టి జెండా స్వభావం మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నారని ఆయన సూటిగా ఆరోపణ చేసారు .
తెలంగాణా లో ఓ వై సి , ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ లు మతోన్మాద ఉన్మాదాలకు అగ్గి రాజేసి రాజకీయంగా సొంత లబ్ది పొందుతున్నారు .
ఎమ్ ఐ ఎమ్ పార్టి మూలాలు రజాకార్ల క్రూరత్వం నుండి పురుడు పోసుకున్న ఖాసీం రజ్వి వారసత్వం నుండి ఉద్బవిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టి జీసెస్ క్రిస్ట్ ను అతి క్రూరంగా శిలువ వేయించిన యూదుల హృదయాల్లో నుండి జన్మించిన జనసేన జండా భవిష్యత్ సమాజానికి తీవ్ర ప్రమాదం అన్నారు . ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో కూడా నెమ్మిది నెమ్మిదిగా మతోన్మాద సమస్యలు లేవనెత్తే ప్రమాదాలు సంభవిస్తాయేమో ననే ఆందోళనలు కలుగుతున్నాయన్నారు . జనసేన జండా భారతీయుల మనోభావాలకు విఘాతంగా మరే పరిస్థితులు కనపడుతున్నాయని , అత్యున్నత ప్రజాస్వామ్యం గల భారతదేశంలో విదేశీ మతోన్మాద ఉన్మాద భావజాలం గల అసదుద్దీన్ ఓ వై సి వంటి పార్టి సిద్ధాంతాలు లౌకిక దేశం అయిన భారత్ కు అత్యంత ప్రమాదం అని బావించాలి . మత సామరస్యానికి ప్రతీకాగా వున్న భారత్ వంటి దేశంలో యూదుల నమూనా జెండాతో జనసేన పార్టి జండాను ఎగురవేయటం కూడా భవిష్యత్ అనార్దాలకు కారణాలు కావొచ్చునన్నారు .
ఒకసారి బాప్టిస్ట్ నని , మరో సారి ఆపాలజిటిక్ సనాతని హిందూ నని ప్రకటించుకునే పవన్ కళ్యాణ్ చేష్టలుతో
ఆ పార్టి జండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక శాంతి భద్రతల సమస్యలకు కారణం కావొస్తుందన్నారు . రాజకీయాలకు తావు లేకుండా నిఘా వర్గాలు జనసేన జెండా , ఓ వై సి పార్టి లపై ప్రత్యేక నివేదికను భారత ప్రభుత్వానికి , కేంద్ర ఎన్నికల సంఘానికి చర్యలు తీసుకోమని ప్రత్యేక నివేదిక ద్వారా సిఫార్సు చేయాలని , భారతదేశంలో ప్రతి ఇంటిలోను దేశ భక్తులు వున్నారని ప్రపంచానికి తెలియచేసే విధంగా భారతదేశ పాలన ఆదర్శంగా ఉండాలన్నారు . జనసేన జండా కారణంగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో కొంతమంది యువతకు దేశభక్తి సన్నగిల్లుతుందని , ఓ వై సి పార్టి పూర్తిగా భారత రాజ్యాంగ జాతీయ బావాలకు వ్యతిరేకంగా వారి పార్టి విది విధానలను అమలు చేస్తున్నా భారత ఎన్నికల సంఘం పట్టించుకోక పోవటం, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవటం కూడా భారతదేశ సార్వాబౌమాధికారానికి పెను ప్రమాదంగా భావించాలని , జనసేన జెండా ను రద్దు చేయక పోయినా , ఓ వై సి పార్టి ని రద్దు చేయకపోయినా భారత అంతర్గత భద్రతకు విఘాతంగా బావించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు ..
ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , మాసా సుభద్ర , కందివలస రమణ, చల్లా శివ దుర్గా ప్రసాద్ , కందివలస హైమావతి తదితరులు పాల్గొనియున్నారు ..
-- మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
మొబైల్ : 9248777222 .

Post a Comment

0 Comments