గద్దర్ పురష్కార అవార్డుల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ అని శంభోదించకుండా చిరంజీవి ప్రక్క రాష్ట్రం అని శంభోదించటం సామాజిక ద్రోహం కాదా !
ఎంటీఆర్ కన్నా నాగయ్య గొప్ప నటుడు అన్న చిరంజీవి నేడు ఎంటీఆర్ పురష్కారం ఎలా అందుకున్నారో చెప్పగలరా !
రాజకీయ, సినిమా బిక్ష పెడుతుంది ఆంధ్ర రాష్ట్రం కాదంటారా . వేదికల మీద మాత్రం పొరుగు రాష్ట్రం అంటుంటారా . చిరంజీవి చేస్తున్న స్వరాష్ట్ర ద్రోహం ఆంధ్రులకు యాదుంటుంది అని మరువొద్దు .
ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం అయి నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ అధికారాలు ఎందుకో . సినిమా ధరలు పెంచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవసరం ఏమిటో చెప్పగలరా !
ఆంధ్రప్రదేశ్ చిరునామా తోనే చిరంజీవి కేంద్ర మంత్రి అయినా , పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగినా , మరో తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సి అయినా అని మెగా బ్రదర్స్ మరిచిపోతే ఎలా !
మెగా బ్రదర్స్ ఆంధ్ర రాష్ట్రం పై ఈ విధంగా విషం కక్కితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ తరం వారు నూతన నటి నటులుగా నిరూపించు కోవటంపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతికి ఆదర్శం నిలుస్తారు ..
---మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
మొబైల్ : 9248777222 .

0 Comments