మనిషి మృగంగా మారుతున్న వేళ.. ధర్మం గతి తప్పుతోందా - ఆర్ పి సి అధ్యక్షులు మేడా శ్రీనివాస్

 


మనిషి మృగంగా మారుతున్న వేళ.. ధర్మం గతి తప్పుతోందా -  ఆర్ పి సి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ 

 
 క్యాపిటల్ వాయిస్ : రాజమహేంద్రవరం: ఏప్రిల్ 7 :-అడవిలో క్రూర మృగానికి ఉండే క్రమశిక్షణ, సాత్వికత్వం నేటి నాగరిక మనిషిలో కరువవుతున్నాయి. ప్రకృతిలో భాగమైన జంతువు అవసరానికి మించి ఆశించదు, కానీ విజ్ఞానవంతుడైన మనిషి స్వార్థంతో విచక్షణ కోల్పోతున్నాడని సామాజిక విశ్లేషకులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో పెరుగుతున్న నైతిక విలువల పతనంపై నిప్పులు చెరిగారు.శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో నెలకొన్న అశాంతికి కేవలం ఒక కారణం మాత్రమే లేదని, అది అనేక అంశాల సమ్మేళనమని పేర్కొన్నారు:ఉన్నదానితో సంతృప్తి చెందక, పక్కవాడి ఎదుగుదల చూసి ఈర్ష్య పడటమే మనిషిని పతనం వైపు నడిపిస్తోంది. లక్ష్యం లేని ఆశ దురాశగా మారి, మనిషిని రాక్షసుడిగా మారుస్తోంది కష్టపడే తత్వం, నైపుణ్యం పెంచుకోవాలనే ఆలోచన తగ్గి.. అడ్డదారిలో సంపాదించాలనే 'ద్రోహ చింతన' పెరిగింది. అహంకారం, ఆధిపత్యం కోసం మనిషి తోటి మనిషిని తొక్కేయడానికి సిద్ధపడుతున్నాడు. దీనికి కారణం తన మీద తనకు నమ్మకం లేకపోవడమే.వ్యవస్థల వైఫల్యం - పర్యావరణ కాలుష్యం "విద్య నేర్పేది విచక్షణను, కానీ నేటి విద్యా విధానం కేవలం ధనార్జనను మాత్రమే నేర్పుతోంది" అని ఆయన విమర్శించారు. కుటుంబ వ్యవస్థలో బాల్యం నుండే నైతిక విలువలను బోధించకపోవడం వల్ల, పిల్లలు క్రమశిక్షణ లేని వాతావరణంలో పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థలు కూడా ఒక్కోసారి దారి తప్పుతుండటం వల్ల సామాన్యుడికి 'ధర్మం'పై నమ్మకం సడలుతోందని ఆయన హెచ్చరించారు.చివరగా ఆయన ఇస్తున్న పిలుపు ఒక్కటే: "ధర్మో రక్షిత రక్షితః".మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆధర్మం మనల్ని కాపాడుతుంది. కుటుంబ విలువలను కాపాడుకుంటూ, సామాజిక బాధ్యతతో మెలిగినప్పుడే మనిషిలో మళ్ళీ మానవత్వం చిగురిస్తుంది. ప్రకృతిని ప్రేమించడం, స్వార్థాన్ని వీడటం ద్వారానే ఈ సమాజాన్ని కాలుష్యం నుండి, క్రూరత్వం నుండి కాపాడుకోగలమని మేడా శ్రీనివాస్ ఉద్ఘాటించారు.

Post a Comment

0 Comments