ఆంధ్రాబ్యాంక్ పేరును పున ప్రతిష్ట చేయాలి...... మేడా శ్రీనివాస్

 




ఆంధ్రాబ్యాంక్ పేరును పున ప్రతిష్ట చేయాలి......  మేడా శ్రీనివాస్


విభజన హామీల్లో ఒకటైన రాజమండ్రి సంస్కృతిక అకాడమీని సాధించాలి.

రాజమండ్రి , కొవ్వూరు ప్రాంతాలను జంట నగరాలుగా అభివృద్ధి జరగాలి.

రాజమండ్రి ని పర్యాటక "హబ్" గా ప్రభుత్వం ప్రకటించాలి.


క్యాపిటల్ వాయిస్, రాజమండ్రి :- రాజమండ్రి లో గల గోదారి గట్టు పొడవును హైదరాబాద్ ట్యాంక్ బాండ్ కి మించి అభివృద్ధి సాధించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక కు నిదర్శనంగా ఆంధ్ర పితామహుడు గోపరాజు పట్టాభి సీతారామయ్య చేత స్థాపించబడిన "ఆంధ్రాబ్యాంక్" పేరును మోడీ సర్కార్ ఆంధ్రులపై ద్వేషం తో ఆ పేరును రద్దు చేసి యూనియన్ బ్యాంక్ లో విలీనం చేసిన వైనం క్షమించరాని నేరంగా పరిగణించాలని ఆయన ఆవేదన చెందారు. ఆంధ్రాబ్యాంక్ పేరును మోడీ సర్కార్ నిరంకుశంగా తొలగించినా ఆంధ్రప్రదేశ్ లో గల అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించి మోడీ పట్ల వారికి గల భక్తిని విశ్వాసాన్ని, భయాన్ని చాటుకుంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోను జరగని అన్యాయం ఆంధ్రులకు మాత్రమే జరుగుతుందని, ఏ రాష్ట్ర మాతృ బాష పైన ఉన్న ప్రభుత్వ నామకరణాన్ని తొలగించే ధైర్యం, దమ్ము మోడీ సర్కార్ చేయలేదని, ఒక ఆంధ్రప్రదేశ్ పైనే మోడీ సర్కార్ విషం కక్కుతుందని, ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేసారని మోడీ సర్కార్ కూటమి పొత్తులతో ఆంధ్రులను ఓట్లుకు యాచిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.విభజన హామీల్లో ఒకటైన 100 కోట్ల తో రాజమండ్రి సంస్కృతిక అకాడమీ సాధన కై ఎన్నడు రాజమండ్రి ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లో గళం విప్పక పొగ అభివృద్ధి కోసం గొప్పలు చెప్పుకోవటం విశేషం. ఈ 5 ఏళ్ల కాలంలో రాజమండ్రి నుండి ప్రాతినిత్యం వహించిన చంద్రబాబు, జగన్ పార్టీల నేతలు ఎన్నడైనా రాజమండ్రి సమస్యలపై మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ! అని ఆయన ఘాటుగా స్పందించారు. సినిమా సెట్టింగులను అభివృద్ధిగా ప్రజలను నమ్మించే విధంగా ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నారని, ప్రజలు ఈ నేతలను ప్రశ్నించాలని, ఓటుతో బుద్ది చెప్పాలని ఆయన పేర్కొన్నారు.మనకు సంబంధం లేని ప్రాంతాలను, సాధ్యం కాని అభివృద్ధి ని కాకినాడ, రాజమండ్రి ని కలుపుదాం, గోదావరిని సముద్రంగా మారుద్దాం అని ఉత్తుత్తి మాటలు, మోసపురిత మాటలతో రాజమండ్రి ప్రజలను మోసగిస్తున్నారని, రాజమండ్రి కి పడమర హద్దు అయిన కొవ్వూరు ప్రాంతంను, రాజమండ్రి ప్రాంతంను జంట నగరాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వానికి ఒక ప్రాజెక్ట్ నివేదిక ను సమర్పించే దిశగా నేతలు ఆలోచన చేయాలని, కొవ్వూరు, రాజమండ్రి ప్రాంతాలను జంట నగరాలుగా తీర్చి దిద్దటానికి ఎన్నెన్నో అర్హతలు వున్నాయని, రెండు ప్రాంతాలు వ్యవసాయకంగాను, పారిశ్రామికంగాను, రోడ్డు, రైల్వే, ఆకాశ ప్రయాణ, రవాణా మార్గాలకు ఇప్పటికే అనువైనదిగాను,అభివృద్ధి మార్గంలో వున్న ప్రాంతాలని, నది జలాలు, గనుల సంపద పుష్కలంగా వున్న ప్రాంతాలని, అభివృద్ధికి, పథకాల ముసుగులో యాచనకు పెద్దగా తేడా తెలియని నేటి నేతలు రాజమండ్రి కి ప్రాతినిత్యం వహించటం గోదావరి ప్రాంత ప్రజలు దురదృష్టంగా భావించాలని ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెండటానికి ఎంతో అవకాశం వుందని, రాజమండ్రి గోదావరి గట్టు పొడవు అంత హైదరాబాద్ ట్యాంక్ బాండ్ కు మించి అభివృద్ధి ని సాధించవచ్చునని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గంజాయి, బ్లేడు బ్యాచ్ లను పోషించటానికే తప్ప అభివృద్ధి పై దృష్టి సారించకపోవటం రాజమండ్రి ప్రజల నగర దురదృష్టం అని స్థానికేతరులు, రాజకీయ వ్యాపారస్తులతో రాజమండ్రి మహా నగరం తీవ్రంగా నష్టపోతుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు.ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ సిమ్మా దుర్గారావు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్ సర్వశ్రీ కాసా రాజు, ఎండి హుస్సేన్, దూడ్డే సురేష్,వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్,సుంకర వెంకట భాస్కర రంగారావు, బసా సోనియా, గెద్దాడ సుందరి, మాసా వెంకట లక్ష్మి, బత్తెన శివన్నారాయం , అడపా శేషగిరి, మాసా అప్పాయమ్మ, మాసా రత్నకుమారి, మాసా లక్ష్మి, మాసా రాజులమ్మ, అడపా దేవుడు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments