సజీవ దహనం అయిపోతున్న మీడియా విలువలను కాపాడుకోగలమా !


 

సజీవ దహనం అయిపోతున్న మీడియా విలువలను కాపాడుకోగలమా !

కార్పొరేట్ బానిస మీడియా సామజిక ఉగ్రవాదంతొ సమానం .
ఆ మీడియా వార్తలకు అలవాటు పడితే గంజాయి వంటి మత్తు కు బానిసలుగా మారినట్టే .
నేటి జర్నలిజం అంటే అక్షరాన్ని అమ్ముకోవటమా ! నమ్ముకోవటమా !
***********************
మేడా శ్రీనివాస్ , ఆవేదన ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
***********************
1000/- కోట్లు నిధితో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా మీడియా సంస్థలకు ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని,జర్నలిస్ట్ లకు భద్రత - భరోసా కల్పించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ..
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా కొన్ని వ్యాపార రాజకీయ , కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందిగా చిక్కుకు పోయిందన్నారు . ఒక వాస్తవ ఘటనను నిజాయితీగా వార్తగా చూపించే ప్రయత్నం చేస్తున్న ఒక జర్నలిస్ట్ తపనను మరో కిరాయి జర్నలిస్ట్ చేతనే ఆ వార్తపై బురద జల్లించే కోణంలో తెర వెనుక కొన్ని రాజకీయ శక్తులు , కొన్ని కార్పొరేట్ మాఫియా శక్తులు మరో తప్పుడు జర్నలిజం వార్తను ప్రచారం లోకి తెస్తు వాస్తవాన్ని గమనించ లేని సామాజిక కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు . కొంతమంది భయం తోను , కొన్ని బలహీనతల తోను , కొన్ని సొంత ప్రయోజనాల కోసం వ్యాపార రాజకీయ పార్టీలకు , విదేశీ , స్వదేశీ కార్పొరేట్ సంస్థ లకు శాశ్వత బానిసలుగా మారి పోతున్నారు . ఈ తరహా జర్నలిస్టులు ఎక్కువ శాతం నిరుత్సాహం తోను , వేధింపులను తాళలేకనో అనే అబద్రతలకు లోనై పవిత్ర మైన జర్నలిజం సమాజానికి శాపంగా మారి వ్యవస్తికృత నేరాల చూస్తూనే ఆజన్మాంత కభోదిలుగా మౌనమే అస్త్రంగా జీవిచేయటానికి అలసటతో అలవాటుగా మారిపోతున్నారు . నేడు మీడియా ను ముందుకు నడపటం అంటే కత్తి మీద సాము చేయటం వంటిది . పులిమీద స్వారి చేయటం వంటిది . ఒకప్పుడు మీడియా వ్యవస్థను ప్రోత్సహించే సామజిక ప్రభుత్వాలు ఉండేవి . నేడు ఓటును , వార్తను ఒకే విధంగా డబ్బుతో నడిపించే ప్రభుత్వవాలే నేడు శాసన కర్తలుగా వుంటున్నారు . నేడు ప్రజల శ్రమను , బ్యాంకు లను, అధికారిక ఆర్ధిక నేరాలను చేసే వారే పాలకులుగా చట్ట సభలను శాసిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .
ప్రస్తుత వ్యాపార రాజకీయ శక్తులకు బానిసలుగా మారి పోయిన ఆ కొన్ని మీడియా సంస్థల వార్తలు సామాజిక ఉగ్రవాదం కన్నా ప్రమాదర పరిస్థితులుగా వుంటున్నాయాన్నారు . కిరాయి వార్తలుతో కిరాయి జర్నలిస్టులకు ఉపాధి కల్పిస్తు నిజాలను , పౌర హక్కులను భూ స్థాపితం చేసేస్తున్నారు . ఒకప్పుడు మీడియా విలువలే ఊపిరిగా భాద్యత గల జర్నలిజాన్ని సమాజానికి అందించేదిగా ఉండేదన్నారు . చెడుగా ఒక వార్త వస్తే కుమిలి పోయే నేతలు వుండే వారు . ఆ పొరపాట్లను సరిచేసుకునే వారు .
ఆ వార్త ప్రచురించిన సంస్థ ను గౌరవించేవారు . భయపడే వారు . అభినండించే వారు . నేడు నిజాన్ని వార్తగా ప్రచురిస్తే దాడులు , దౌర్జన్యాలు చేస్తున్నారు . అక్రమ కేసులు బనాయిస్తు జర్నలిస్ట్ ల ఆత్మస్టైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు . నేడు జర్నలిస్ట్ గా బ్రతకాలి అంటే పాలకులు, నేతలు చేస్తున్న నేరాలను కప్పి పుచ్చాలి. సందర్భాన్ని బట్టి వాస్తవ వార్త ప్రచురించిన జర్నలిస్ట్ పై బురద జల్లించాలనేదే నేటి జర్నలిజంగా సాగుతుందన్నారు . ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి నేరాలకు కేంద్ర బిందువుగానే వున్నాయి . వార్త వ్రాసే సాహసం మాత్రం ఏ జర్నలిస్ట్ చేయలేక పోతున్నారు . ఎందుకంటే హక్కులను రక్షించే వ్యవస్థలు నేడు లేవు . వార్త వ్రాయటం కన్నా ఆ అవినీతిలో భాగస్వాములుగా చేయి చాచటమే ఉత్తమ మైన మార్గంగా మలుచుకుంటున్నారు . భద్రత లేని జర్నలిజంకు నేటి సమాజం కన్నీటి పర్యాంతకంగా మారుతుంది . ప్రస్తుత మీడియా వృత్తి ఒక రకమైన మత్తుగా మారిపోయింది . వ్యవస్థలో కీలకమైన రాజకీయ రంగం , పోలీస్, రెవిన్యూ , ఇతర మాఫియా నేతలతో నిత్య పరిచయాలు తన భవిష్యత్ ను, బిడ్డల అభ్యున్నతిని, సామజిక భద్రతను , భాద్యతలను మరిచిపోయేలా చేస్తున్నాయి . ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల పనితీరు హమస్ వంటి ఉగ్రవాదాన్ని మెప్పించే విధంగా వుంటుందని , కొన్ని విలువలుతో కూడిన వృత్తులు కలుషితం చెండటం రాజ్యాంగ విద్రోహ చర్య కన్నా ప్రమాదం అని ఆయన తీవ్ర ఆందోళన చెందారు .
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రల్లో కొన్ని మీడియా సంస్థల వార్తలు ఎవరికి ఉపయోగమో , ఎవరికి మేలు చేస్తున్నాట్టో మెరుగైన సమాజానికి అర్ధం కాకుండా పోతుందన్నారు .
ఆ మీడియా సంస్థల వార్తలు చదివినా , వీక్షించినా గంజాయి , హిరైన్, కోకైన్ వంటి ప్రమాదకర మైన మత్తు ప్రధార్దాలకు బానిసలుగా మారినట్టే నన్నారు . అధికారిక ప్రభుత్వ తోడ్పాటు లేకుండా మీడియా రంగాన్ని నిర్వహించడం సామాన్య జర్నలిజంకు సాధ్యం కాదు . నేటి సామాజిక ఆర్ధిక పరిస్థితుల్లో కూడా ఖరీదైన పద్ధతుల్లో మీడియా నిర్మాణ రంగాలను లాభాల బాటల్లో నడిపిస్తున్నారంటే జర్నలిజం తోనా ! ఆ ముసుగులో ఎర్నలిజం తోనా అనే సందేహాలను ప్రజలను , సమాజాన్ని నిత్యం వెంటాడుతున్న ప్రశ్నలన్నారు . ఒక సంపన్న వర్గానికో , వ్యాపార ప్రైవేట్, కార్పొరేట్ సంస్థకో , అనుకున్న రాజకీయ పార్టికో అనుకూల మైన కట్టప్ప వార్తలు కాకుండా సామాజిక స్పృహతోను, భాద్యత తోను మీడియా కధనాలు ప్రచురించే
ఏ ఒక్క కార్పొరేట్ మీడియా అయినా నేడు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో వుందా ! అని అన్నారు . నేడు ఒక రకమైన ఆ మీడియా సంస్థలను ప్రజలు అనుసరించటం కూడా సామజిక ఉన్మాద ఉగ్రవాద చర్యల్లో ఒక భాగమేనాన్నారు . భారతదేశ అత్యున్నత ప్రజాస్వామ్యంలో నాల్గొవ శక్తిగా పిలవబడే ప్రతిష్ట గల మీడియా వ్యవస్థ నేడు ప్రజలతో కీర్తింప బడుతుందా ! అనే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన భాద్యత ప్రతి పౌరుడు కర్తవ్యం అన్నారు . నేడు దూమపానం , మధ్యపానం, చతుర్ముఖ పారాయణణం వంటి ఇతర చెడు మత్తు ప్రధార్దాలకు బానిసలుగా మారకపోయినా పరవాలేదు . ఆ కొన్ని మత్తు మీడియా వార్తలు చదవక పోయినా , వీక్షించక పోయిన వాళ్ళు మాత్రమే భాద్యత గల ఉత్తమ పౌరులు అనే వాదన రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం అని ఆయన పేర్కొన్నారు .
నేటి జర్నలిజం అంటే అక్షరాన్ని అమ్ముకోవటమే వృత్తి ధర్మం అన్నట్టుగా పాలకుల పనితీరు వుంటుందని , అక్షరాన్ని నమ్ముకుంటే వేధింపులు , అవమానాలు తప్పవు అన్నట్టుగా పరిస్థితులు సామాన్య మీడియా ప్రతినిధులను వెంటాడుతున్నాయి . వర్ధమాన సిని నటి ప్రత్యూష , అయేషా మీరా, సుగాలి ప్రీతి మరణాలపై వారి తల్లులు చేస్తున్న పోరాటాలపై , వెలుగు చూడని అనేక ఘోర ఘటనలపై , రాజమండ్రిలో ఒకే కుటుంబంలో జరిగిన 5 మిష్టరి హత్యలపై , తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆమాత్యుడి ప్రొద్బలంతో జరిగిన ఒక పోలీస్ లాకప్ మరణం పై దృష్టి ఏ కార్పొరేట్ మీడియా ద్రుష్టి సారించదు. వార్త ప్రచురించదు. భారతదేశంలో ఎఫ్టిన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ హెచ్ పి వి వంటి ఉచిత కేన్సర్ వ్యాక్సిన్ లో దాగి వున్న మర్మం కోసం ప్రజలకు తెలియపరచరు. ఇలాంటి ఘటనలు మన ప్రభుత్వాలకు అక్కరలేదు. కార్పొరేట్ మీడియాకు ఆ వార్తలు అవసరం లేదు . నేటి మీడియా విలువలు అంటే సామజిక ప్రతిష్టను మంటగలపటమేనన్నారు . విభజన సమయంలో కేంద్రం
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలకు జరిగిన అన్యాయాలపై ఏ ఒక్క కార్పొరేట్ మీడియా లోతైన వార్తలు వ్రాయలేదు . నిజాలను చూపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను రాజకీయ ముడి సరుకుగా మార్చుకుని కిరాయి కార్పొరేట్ మీడియా వార్తలతో నిజాలను దారిమళ్ళించేశారు . ప్రజలు ఆలోచనా శక్తి కోల్పోయే విధంగా ఏదో ఒక కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తూనే వుంటున్నారు . రాష్ట్ర విభజనతో ఎవరు లబ్ది పోదారు . పునర్వీభజన చట్టం అమలు జరిగిందా ! రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్ కు దీర్ఘాకాలిక సమస్యల పరిష్కారం లేకుండా విభజన జరిపించారా ! అనే నిజాన్ని ఏ కార్పొరేట్ మీడియా ప్రజలకు తెలియ చేయక పోవటం విద్రోహ చర్య కాదంటారా ! రెండు తెలుగు రాష్ట్రాల నుండి పునర్వీభజన చట్టంపై పార్లమెంట్ లో పునర్చర్చకు అనుమతి తీసుకుంటేనే రెండు తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన భవిష్యత్ ఏర్పడుతుందన్నారు . నాడు ఆంధ్ర మేధావులకు డబ్బు సూట్ కేసులు , కేసీఆర్ కు ఇతర బారి అవినీతి తాయిలాలు ఇచ్చి ఆశాస్త్రీయ విభజన జరిపించినది నిజం కదా ! ఆ నిజాలను కార్పొరేట్ మీడియా ప్రజలకు తెలియచేసిందా ! అని గుర్తు చేసారు . సాధారణ మీడియా నిజాలు ప్రజలకు తెలియ చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు . ఖరీదైన ప్రచార సాంకేతిక మార్గాల ద్వారా అబద్దలను నిజాలు అన్నట్టుగా పదే పదే కిరాయి డిబేట్ ల ద్వారా ప్రచారాలను విస్తృతంగా ముందుకు తీసుకెళుతున్నారు .
ఆ కార్పొరేట్ మీడియా వార్తల ప్రభావం సమాజానికి , బావితరాల భవిష్యత్ కు పెను ప్రమాదంగా మారుతున్నాయన్నారు . నిజాలను చూపించే సామాజిక మీడియాను బ్రతికించుకోక పొతే వ్యవస్థ తీవ్రంగా నష్ట పోతుందన్నారు .
ఈ అంశాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిధుల సహాయంతో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలుకు 1000 /- కోట్లు నిధితో మీడియా కార్పొరేషన్ బోర్డు ను ఏర్పాటు చేయాలని , జర్నలిస్తుల భద్రతా చర్యలకు మెరుగైన సంస్కరణలను అమల్లోకి తేవాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ..
ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , కారుమూరి యుగంధర్ , దోషి నిషాంత్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , దుడ్డే త్రినాద్ , వాడపల్లి జ్యోతిష్ , దోషి నిషాంత్ , కాకర ప్రసాద్ , సింహాద్రి తిలక్ , చల్లా శివ దుర్గాప్రసాద్ , మాసా అప్పాయమ్మ , అడపా శేషగిరి , యర్రా బాల మురళి కృష్ణ , మాసా ప్రమీల, మాసా ప్రవీణ్ తదితరులు పాల్గొనియున్నారు ..
--మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్ ..
మొబైల్ : 92487772222 ..

Post a Comment

0 Comments